- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023: ఆ జట్టు ప్లేఆఫ్స్‌కి వెళ్లిందో.. వాళ్లను ఆపడం కష్టం : రవిశాస్త్రి
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023 సీజన్‌లో పాయింట్స్ టెబుల్‌లో 15 పాయింట్లతో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఇంకో మ్యాచ్ గెలిస్తే మిగిలిన జట్లతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్ చేరుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరడంపై టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. "చెన్నై ప్లేఆఫ్స్‌లోకి వెళితే చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకంటే ప్లేఆఫ్స్‌లో రెండు మ్యాచులు కూడా చెన్నైలో జరగబోతున్నాయి. వాళ్లకు అక్కడ గెలవడం సింపుల్, చెపాక్ స్టేడియంలో సీఎస్‌కేని అడ్డుకోవడం కష్టమైపోతుంది".. అంటూ రవిశాస్త్రి కామెంట్ చేశాడు. ఐపీఎల్‌లో క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ఆడిన ప్రతీసారీ ఫైనల్ చేరింది చెన్నై సూపర్ కింగ్స్.
2022 సీజన్‌లో కొందరు చెన్నై ప్లేయర్లు ఫెయిల్ అయ్యారు. అయితే ఈసారి వాళ్లే చెన్నై సూపర్ కింగ్స్‌కి మ్యాచ్ విన్నర్లుగా మారారు. దీనికి కారణం ధోనీ వాడుతున్న కాంబినేషన్ టెక్నికే. ప్రతీ ప్లేయర్ బలబలాలను పూర్తిగా చదివి.. అతను ఏ ప్లేస్‌లో ఫిక్స్ అవుతాడో అదే ప్లేస్‌లో దింపుతాడు. గత సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన రవీంద్ర జడేజా.. ఈసారి ఇప్పటికే మూడు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచాడు. అలాగే శివమ్ దూబే, మొయిన్ ఆలీ కూడా అదరగొడుతున్నారు.