- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023 Final: ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైతే రిజర్వ్ డే ఉందా లేదా..?
దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్‌లో వాన దంచికొడుతుండటంతో ఐపీఎల్ అభిమానుల్లో కొత్త టెన్షన్ పట్టుకుంది. అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా..? లేదా..? అని నరేంద్ర మోడీ స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులతో పాటు టీవీలు, మొబైల్ తెరల ముందు ఉన్న కోట్లాది మంది అభిమానులలో ఆందోళన మొదలైంది. అయితే ఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది. రిజర్వ్ డే కంటే ముందు నేడు రాత్రి 9:30 గంటల వరకూ ఒక్క ఓవర్ కూడా పడకుండా ఉంటే.. అప్పుడు మ్యాచ్‌ను కుదిస్తారు. రాత్రి 11:50 గంటల వరకు వాన ఆగితే 5 ఓవర్ల ఆట అయినా సాధ్యపడుతుంది. అయితే అదీ కూడా వీలుకాని సందర్భంలో మే 29న రిజర్వ్ డే ఉంది. ఇక రేపు కూడా ఇదే సీన్ రిపీట్ అయితే గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.
అహ్మదాబాద్‌లో వరుణుడు కుండపోత వర్షంతో కోట్లాది మంది అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాడు. అయితే సోషల్ మీడియాలో మాత్రం.. ఐపీఎల్-16 ఫైనల్ కు రిజర్వ్ డే లేదని.. నేటి రాత్రి 12: 26 గంటల వరకూ వర్షం నిలిచిపోకుంటే అప్పుడు 5 ఓవర్ల మ్యాచ్ సాధ్యమవుతుందని పోస్టులు వైరల్ అవుతున్నాయి. కనీసం సూపర్ ఓవర్ ద్వారా అయినా మ్యాచ్ ఫలితం నిర్ణియించే అవకాశం ఉందని ట్వీట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రిక్ బజ్‌లో కూడా ఇదే సమాచారాన్ని పోస్ట్ చేశారు. కానీ తర్వాత క్రిక్ బజ్.. రిజర్వ్ డే ఉందని బీసీసీఐ అధికారులు క్లారిటీ ఇచ్చారని తెలిపింది. అయితే ఇవాళ మ్యాచ్ కట్ ఆఫ్ టైమ్.. రాత్రి 12:06 గంటలు. అది కూడా 5 ఓవర్ల మ్యాచ్ కే సాధ్యమవుతుంది.