- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023 Final: రిజర్వ్ డే రోజు వర్షం ముప్పు ఉందా?.. ఐపీఎల్ ఫైనల్ జరగతుందా లేదా?
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ ఫైనల్‌కు అంతా రెడీ అయిపోయిందని.. ఆదివారంతో ఈ సూపర్ టోర్నీ ముగుస్తుందని అంతా అనుకున్నారు. కానీ వర్షం అడ్డుపడటంతో.. ఆదివారం జరగాల్సిన మ్యాచ్ పూర్తిగా వర్షార్పణం అయిపోయింది. కనీసం టాస్ కూడా వేయడం కుదర్లేదు. రాత్రి 11 గంటలకు వర్షం తగ్గే సరికి చాలా ఆలస్యం అయిపోయింది. అప్పటికే భారీగా తడిసిపోయిన స్టేడియాన్ని మ్యాచ్‌కు సిద్ధం చేయడానికి చాలా టైం పడుతుంది. ఇదంతా అర్థం చేసుకున్న అంపైర్లు మ్యాచ్‌ను ఆదివారం నాడు రద్దు చేశారు. రిజర్వ్ డే అయిన సోమవారం ఈ మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆదివారం అంతలా వర్షం కురిస్తే సోమవారం మ్యాచ్ పూర్తిగా జరుగుతుందా? అని కొందరు అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో సోమవారం సాయంత్రం ఏం జరుగుతుందో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
అయితే వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. సోమవారం సాయంత్రం అహ్మదాబాద్‌లో వర్షం పడే అవకాశం కేవలం 10 శాతమే ఉందట. దీంతో పూర్తి 40 ఓవర్ల ఆటను ప్రేక్షకులు ఎంజాయ్ చేయొచ్చని తెలుస్తోంది. అలాగే వాతావరణ వివరాలు వెల్లడించే ప్రముఖ వెబ్‌సైట్ అంచనాల ప్రకారం.. సోమవారం నాడు అహ్మదాబాద్‌లో వర్షం పడే అవకాశాలు చాలా తక్కువ. అది కూడా మ్యాచ్ జరిగే సమయంలో దాదాపుగా వర్షం పడదు. అలాగే వాతావరణం 33 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. మరి మ్యాచ్ సమయానికి ఏం జరుగుతుందో చూడాలి.
Thanks to all the fans for their continued patience and support 👏🏻👏🏻
— IndianPremierLeague (@IPL) May 28, 2023
See you tomorrow in Ahmedabad 🤗
⏰ 7:30 PM IST #TATAIPL | #Final | #CSKvGT pic.twitter.com/2UUkSKYmKO