IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ల కిట్ చోరీలో పోలీసుల పురోగతి..

by Vinod kumar |
IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ల కిట్ చోరీలో పోలీసుల పురోగతి..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోని కొంత మంది ఆటగాళ్ల కిట్‌లు చోరీకి గురైన విషయం తెలిసిందే. ఈ చోరీపై ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మేనేజ్‌మెంట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ జరిపిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకుని.. ప్లేయర్లకి వారి బ్యాట్‌లను అందజేశారు. ఈ మేరకు ఆ బ్యాట్‌ల ఫొటోని డేవిడ్ వార్నర్ షేర్ చేశాడు. గత శనివారం బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్.. అనంతరం గురువారం మ్యాచ్ కోసం ఢిల్లీకి చేరుకుంది. కానీ ఈ ప్రయాణంలో ఢిల్లీ జట్టులోని కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్, యంగ్ బ్యాటర్ యశ్ ధూల్ బ్యాట్స్‌ చోరీకి గురయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed