- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ ఓటమికి అసలు కారణం ఇదే.. కోచ్ వాట్సన్
దిశ, వెబ్‌డెస్క్: చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ స్పందించాడు. ‘‘చెపాక్ పిచ్‌పై 167 పరుగులు మెరుగైన స్కోరు. కానీ.. మాకు మెరుగైన ఆరంభం లభించలేదు. పవర్ ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి మ్యాచ్‌లో పుంజుకోవడం చాలా కష్టమైపోయింది. సీజన్ ఆరంభం నుంచి కూడా బ్యాటింగ్ తడబాటు టీమ్‌ని దెబ్బతీస్తోంది’’ అని పేర్కొన్నాడు.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ గెలిచింది కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే. దాంతో పాయింట్ల టేబుల్‌లో ప్రస్తుతం చిట్టచివరి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ కొనసాగుతోంది. ఇక మిగిలిన మూడు లీగ్ దశ మ్యాచ్‌ల్లోనూ గెలిచినా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ప్లేఆఫ్స్‌కి చేరడం కష్టమే. దీంతో ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది. ఢిల్లీ క్యాపిటల్స్ మూడు మ్యాచ్‌ల్లో.. రెండు పంజాబ్ కింగ్స్‌తోనే ఆడనుంది. మరో మ్యాచ్‌ని చెన్నైతో తలపడనుంది. అయితే ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ భారీ తేడాతో గెలిచినా.. ఢిల్లీ ప్లేఆఫ్స్ అవకాశాలు మిగిలిన జట్లపై ఆధారపడివలసి ఉంటది.