IPL 2023: మరో ఆసక్తికర పోరు.. చెన్నైతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ

by Vinod kumar |   ( Updated:2023-04-20 18:45:53.0  )
IPL 2023: మరో ఆసక్తికర పోరు.. చెన్నైతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా చెన్నై‌లో చెపాక్ స్టేడియం వేదికగా చెన్నైతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ కొట్టబోతున్నది. ముంబై చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన సన్‌రైజర్స్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. రెండు వరుస ఓటములతో టోర్నీని ప్రారంభించిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌, కేకేఆర్ జట్లను మట్టికరిపించింది. సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌ను పేలవ బ్యాటింగ్‌తో చేజార్చుకుంది. చెన్నైతో జరిగే మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని ఆ జట్టు భావిస్తోంది.


సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో స్టార్ ఆటగాళ్లంతా ఫామ్‌లోకి రావడం కలిసొచ్చే అంశం కాగా.. పేలవ బౌలింగ్, మిడిలార్డర్ వైఫల్యం కలవరపెడుతోంది. బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్ ఒక్కడే రాణిస్తుండగా.. ఇతర బౌలర్లు ధారుణంగా విఫలమవుతున్నారు. మార్కో జాన్సెన్ వికెట్లు తీసినా.. పరుగులు కట్టడి చేయలేకపోతున్నాడు. అయితే ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ పటిష్టంగా కనిపిస్తోంది. దాంతో ఇరు జట్ల మధ్య హోరా హోరీ పోరు తప్పేలా లేదు.

సన్‌రైజర్స్ హైదరబాద్ తుది జట్టు(అంచనా):

మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రీచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, మాయంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్/ టీ నటరాజన్

చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు(అంచనా):

డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, MS ధోని (c & wk), డ్వైన్ ప్రిటోరియస్, మతీషా పతిరానా, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ సింగ్

Advertisement

Next Story