- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IPL 2023: గొడవ తర్వాత విరాట్ కోహ్లీ పోస్ట్ వైరల్.. కౌంటర్ పోస్ట్ చేసిన నవీన్ వుల్ హక్
దిశ, వెబ్‌డెస్క్: ఆర్‌సీబీ- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ విరాట్ కోహ్లీ, లక్నో మెంటర్ గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. IPL 2023లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లు ఒక ఎత్తు అయితే.. ఆర్సీబీ, లక్నో మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత జరిగిన ఘటనలు మరో ఎత్తు. ఈ నేపథ్యంలో లక్నోలో జరిగిన గొడవ తర్వాత విరాట్ కోహ్లీ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన కొటేషన్ హాట్ టాపిక్ అయ్యింది. ‘మనం వినేవన్నీ కేవలం అభిప్రాయాలు మాత్రమే, వాస్తవాలు కావు. అలాగే మనం చూసేవన్నీ జరిగినదానికి ఓ వైపు మాత్రమే నిజాలు కావు..’ అంటూ కొటేషన్‌గా స్టేటస్‌గా పెట్టాడు విరాట్ కోహ్లీ.
మ్యాచ్ తర్వాత ఆర్‌సీబీ ఛానెల్‌తో మాట్లాడుతూ ‘ఏదైనా తీసుకోగలిగినప్పుడే ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. లేకుండా ఏదీ ఇవ్వకూడదు.. మాటలైనా, చేతలైనా’ అంటూ కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలు నవీన్ వుల్ హక్, గౌతమ్ గంభీర్‌ల గురించేనని తెలుస్తోంది. విరాట్ కోహ్లీతో గొడవ తర్వాత చాలామంది ఫ్యాన్స్ దృష్టిలో విలన్‌గా మారిపోయిన నవీన్ వుల్ హక్ కూడా దీనికి కౌంటర్ ఇచ్చాడు. ‘నువ్వు దేనికి అర్హుడివో నీకు అదే దక్కుతుంది. ఏదైనా అలాగే జరుగుతుంది. అలాగే సాగుతుంది..’ అంటూ స్టేటస్ పెట్టిన నవీన్ వుల్ హక్, కోహ్లీ ఫ్యాన్స్ కామెంట్లతో విరుచుకుపడుతుండడంతో కామెంట్లను టర్న్ ఆఫ్ చేశాడు.