ఢిల్లీపై పగ తీర్చుకున్న హైదరాబాద్..

by Mahesh |
ఢిల్లీపై పగ తీర్చుకున్న హైదరాబాద్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ వేదికగా జరిగిన DC vs SRH మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం సాధించి ఢిల్లీ గత విజయంపై SRH పగ తీర్చుకుంది. అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 197 పరుగులు చేసింది. ఇందులో అభిషేక్ శర్మ 67, క్లాసిన్ 53, సమద్ 28 పరుగులతో రాణించారు. కాగా 198 పరుగుల భారీ లక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఢిల్లీకి భువనేశ్వర్ మొదటి ఓవర్‌లోనే వార్నర్ ను అవుట్ చేసి షాక్ ఇచ్చాడు.

అనంతరం మిచెల్ మార్ష్ 63, ఫిలిప్ సాల్ట్ 59 పరుగులతో రెండో వికెట్ కు 112 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడమే కాకుండా.. విజయం దిశగా దూసుకుపోయారు. ఈ క్రమంలో బౌలింగ్ చేసిన మయాంక్ మార్కండే వీరి జోరుకు అడ్డుకట్ట వేశాడు. దీంతో కీలక సమయంలో వెంట వెంటనే ఢిల్లీ వికెట్లు కోల్పోవడంతో 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులు మాత్రమే చేసింది. దీంతో హైదరాబాద్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Advertisement

Next Story