ఐపీఎల్‌లో నేడు గుజరాత్ vs బెంగళూరు మ్యాచ్.. ఓడిన జుట్టు ఇంటికే.!!

by Disha Web Desk 12 |
ఐపీఎల్‌లో నేడు గుజరాత్ vs బెంగళూరు మ్యాచ్.. ఓడిన జుట్టు ఇంటికే.!!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 లో కీలక మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఎన్నడూ లేనివిధంగా ఈ సారి ప్లే ఆఫ్ రేసులో 8 ఎనిమిది జట్లు పోటీ పడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ రోజు గుజరాత్, బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారనుంది. ఈ సీజన్ లో అనుకున్నంతగా రాణించిన గుజరాత్, ఆర్సీబీ జట్లు.. పాయింట్ల పట్టికలో 8, 10 స్థానాల్లో ఉన్నాయి. కాగా ఈ రెండు జట్లు ప్లే ఆఫ్ రేసులో కొనసాగాలంటే ప్రతి మ్యాచుల్లోనూ గెలవాల్సి ఉంది. ఈ క్రమంలో రెండు జట్లకు డూ ఆర్ డై మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టు ప్లే ఆఫ్ రేసు నుంచి అధికారికంగా తప్పుకొనుంది. మరి ఈ రోజు జరిగే అత్యంత కీలకమైన మ్యాచ్ లో ఏ జట్టు గెలిసి ప్లే ఆఫ్ రేసులో కొనసాగుందో తెలియాలంటే రాత్రి వరకు వేచి చూడాల్సిందే మరి.

Next Story

Most Viewed