- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL2024: ఎంతటి లక్ష్యాన్నైనా సులభంగా ఛేదిస్తాం: గుజరాత్ కెప్టెన్ గిల్
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్ -14 రసవత్తరంగా కొనసాగుతోంది. అన్ని జట్లు అద్భుతంగా రాణిస్తున్నాయి. ఈ సీజన్‌లో గత రికార్డులన్నీ చెదిరిపోతున్నాయి. ఊహించిన దానికంటే రెట్టిందాన్ని ఆనందాన్ని ఇస్తోందని క్రికెట్ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎంతటి లక్ష్యాన్నైనా సులభంగా చేధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
చివరి మూడు ఓవర్లలో 45 పరుగులు చేయాలి.. పెద్ద కష్టమేం కాదు అనే మైండ్ సెట్‌తో ఆడుతాం అని చెప్పారు. ఆఖరి బంతికి విజయం సాధించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో గిల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో శుభమన్ గిల్ 72 పరుగులు చేశాడు. ఈ సందర్భంగా ఐపీఎల్‌లో 3వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ లీగ్‌లో అత్యంత వేగంగా 3వేల పరుగులు చేసిన రెండో భారతీయ బ్యాటర్‌గా గిల్ నిలిచాడు.