IPL 2024 : చెలరేగిన ఢిల్లీ బౌలర్లు.. ఈ సీజన్‌లోనే అత్యల్ప స్కోరుకు గుజరాత్ ఆలౌట్

by Harish |
IPL 2024 : చెలరేగిన ఢిల్లీ బౌలర్లు.. ఈ సీజన్‌లోనే అత్యల్ప స్కోరుకు గుజరాత్ ఆలౌట్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో భాగంగా బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు చెలరేగిపోయారు. ఢిల్లీ బౌలర్ల ధాటికి విలవిలలాడిన గుజరాత్ 100 పరుగుల లోపే కుప్పకూలింది. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే ఆలౌటైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యల్ప స్కోరు. రషీద్ ఖాన్ చేసిన 31 పరుగులే టాప్ స్కోర్. గుజరాత్ జట్టులో ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేయగా.. ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. షారుఖ్ ఖాన్(0) డకౌటయ్యాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(8), సాయి సుదర్శన్(12), డేవిడ్ మిల్లర్(2), వృద్ధిమాన్ సాహా(2), రాహుల్ తెవాటియా(10) వంటి గుజరాత్ స్టార్లు దారుణంగా నిరాశపరిచారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ 3 వికెట్లు, ఇషాంత్ శర్మ, ట్రిస్టన్ స్టబ్స్ రెండేసి వికెట్లతో గుజరాత్ పతనాన్ని శాసించారు. ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్‌కు చెరో వికెట్ దక్కింది.

Advertisement

Next Story