- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టాస్ పడకుండానే రద్దైన SRHvsGT మ్యాచ్.. ప్లే ఆఫ్స్‌కు చేరిన వేళ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ మెగా టోర్నమెంట్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్స్‌కు వెళ్లింది. గురువారం గుజరాత్ టైటాన్స్‌తో ఉప్పల్ మైదానంలో జరగాల్సిన ఈ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. మధ్యాహ్నం నుంచే ఎడతెరిపిలేని భారీ వర్షంతో గ్రౌండ్ మొత్తం తడిసిముద్దయ్యింది. మైదానం సిబ్బంది ఎంత ప్రయత్నించినా మ్యాచ్ స్టార్ట్ చేసేందుకు వాతావరణం అనుకూలించలేదు. దీంతో మ్యాచ్ రద్దు అయి ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. అయితే 15 పాయింట్లతో హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇప్పటికే కోల్‌కతా, రాజస్థాన్ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరగా.. తాజాగా హైదరాబాద్ చేరింది. అయితే ఎంతో ఉత్సాహంగా ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు మైదానానికి వచ్చిన అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది. కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దు కావడంతో వేలకు వేలు పెట్టి టికెట్స్ కొనుగోలు చేసిన అభిమానులు కాస్త నిరాశ చెందారు. ఈ మ్యాచ్‌కు మొత్తం 33 వేల పైచిలుకు అభిమానులు హాజరు అయ్యారు. దీంతో అందరి డబ్బులు రీఫండ్ చేస్తామని ఆర్గనైజర్స్ ప్రకటించారు. ఆ వివరాలను టికెట్లు బుక్ చేసిన ఈమెయిల్, ఫోన్ నెంబర్లకు పంపిస్తామని తెలిపారు. ఫిజికల్ టికెట్లను కొనుగోలు చేసిన వారు తమ వద్దే ఉంచుకోవాలని సూచించారు.