- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL: హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్‌కు వెళ్లదు.. టీమిండియా మాజీ ప్లేయర్
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2024 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. అన్ని జట్లు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. ఇప్పటికే రెండు జట్లు రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరగా.. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఎలిమినేట్ అయ్యాయి. ప్లే ఆఫ్స్‌లో బెర్త్ కోసం ప్రస్తుతం మూడు జట్లు పోటీ పడుతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు బెర్త్ ఖరారు చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ ప్లేయర్ హర్బజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం లేదని అన్నారు.
ఆర్సీబీ, చెన్నై జట్లు ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉందని అన్నారు. ఇదిలా ఉండగా ఇవాళ హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ ఉండగా.. వర్షం దంచికొడుతోంది. మ్యాచ్ జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే మ్యాచ్ రద్దు అయి చెరొక పాయింట్ రానుంది. దీంతో హైదరాబాద్ జట్టుకు భారీ నష్టం జరుగనుంది. ఇవాళ్టి మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌కు వెళ్లనుంది. మరి మ్యాచ్ జరుగుతుందో లేదో చూడాలి. మరోవైపు హర్బజన్‌పై హైదరాబాద్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తమ జట్టును తక్కువ అంచనా వేయొద్దని స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు ఫ్యాన్స్.