- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వారెవ్వా.. వన్ ఆండ్ ఓన్లీ గబ్బర్
దిశ, వెబ్ డెస్క్: జట్టు సహచరులంతా క్యూ కడుతున్నా.. అతను ఏ మాత్రం తొణకలేదు.ప్రత్యర్థి బౌలర్లపై తన దండయాత్ర చేశాడు. చివరి వికెట్ వరకు పోరాడి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ ను అందించాడు. అతనెవరో కాదు వన్ అండ్ ఓన్లీ గబ్బర్. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ కెరీర్‌లో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.
ఉప్పల్ వేదికగా ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 100 పరుగులు లోపే ఆలౌటయ్యేలా కనిపించిన పంజాబ్ కింగ్స్‌కి శిఖర్ ధావన్ (99 నాటౌట్: 66 బంతుల్లో 12x4, 5x6) తన అసాధారణ పోరాటంతో 143 పరుగుల స్కోరును అందించాడు. ఈ మ్యాచ్ లో పంజాబ్ ఓడినా.. ధవన్ ఆట మాత్రం మొత్తం ఐపీఎల్ కే హైలెట్. దీంతో ధవన్ పలు రికార్డులను క్రియేట్ చేశాడు.
ఇక టీ20 క్రికెట్‌లో పదో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన జంటగా ధావన్-మోహిత్ రాతే జోడి ఐదో స్థానంలో నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి ఆఖరి వరకు నిలబడి పదో నెంబర్ బ్యాటర్ వరకు అందరితో కలిసి ఆడిన రెండో ఆటగాడిగా ధావన్ అరుదైన రికార్డు సాధించాడు. ఇంతకు ముందు పార్థివ్ పటేల్ మాత్రమే 2019లో సీఎస్‌కే తరపున ఈ ఫీట్ సాధించాడు.
ధవన్ చూపిన తెగువ, పోరాటంపై యావత్ క్రికెట్ ప్రపంచం చర్చించుకుంటోంది. అసలు ఐపీఎల్ లో ఇలాంటి ఇన్నింగ్స్ ను ఎప్పుడూ చూడలేదని నెటిజన్లు కామంట్లు పెడుతున్నారు. సెంచరీ అయితే కొట్టలేదు కానీ.. ధవన్ చేసిన 99 పరుగులు ఎన్ని సెంచరీలతో సమానమో లెక్క కట్టలేమని హర్షా బోగ్లే లాంటి కామెంటేటర్లు విశ్లేషించారు.