ధోని ఎంట్రీ ఎఫెక్ట్.. డికాక్ భార్య షాక్!

by Disha Web Desk 14 |
ధోని ఎంట్రీ ఎఫెక్ట్.. డికాక్ భార్య షాక్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచుల్లో ధోని ఎంట్రీ ఇస్తే ఫ్యాన్స్ ఆరుపులతో స్టేడియం దద్దరిల్లిపోతోంది. ఇతర టీమ్‌ అభిమానులైన ధోని ఆటకు ఫిదా అయిపోతున్నారు. అయితే శుక్రవారం ఏకనా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో చైన్నై తలపడింది. ఈ మ్యాచ్‌లో ధోని బ్యాటింగ్ కోసం క్రీజ్‌లోకి వస్తుంటే స్టేడియం అంతా హోరెత్తిపోయింది. ధోని ధోని అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

దీంతో ధోని క్రేజ్‌ను చూసి లక్నో స్టార్ ఆటగాడు, సౌతాఫ్రికా ప్లేయర్ డికాక్ భార్య షాక్ అయ్యింది. ఈ క్రమంలోనే ఆమె యాఫిల్ స్మాట్ వాచ్‌లో చూపించిన శబ్ద తీవ్రతను తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేశారు. ధోని ఎంట్రీ సమయంలో అభిమానుల శబ్ద తీవ్రత 95 డెసిబిల్స్ దాటిందని పేర్కొన్నారు. శబ్ద తీవ్రత ఓ పది నిమిషాలు అలాగే కొనసాగితే తాత్కాలికంగా వినికిడి లోపానికి గురయ్యే ప్రమాదం ఉందని స్మార్ట్ వాచ్ హెచ్చరించిందని తెలిపింది.

Next Story

Most Viewed