ఐపీఎల్‌లో ఎదురులేని జట్టు సీఎస్కేనే.. సాక్ష్యమిదే

by Harish |
ఐపీఎల్‌లో ఎదురులేని జట్టు సీఎస్కేనే.. సాక్ష్యమిదే
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నయ్ సూపర్ కింగ్స్‌(సీఎస్కే)కు ఉండే అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెప్టెన్‌గా ఎం.ఎస్ ధోనీ వైదొలిగినా ఆ జట్టు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో సీఎస్కే జట్టును ఫాలో అయ్యే వారి సంఖ్య 15 మిలియన్లకు చేరింది. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), ముంబై ఇండియన్స్‌ను వెనక్కినెట్టి.. ఇన్‌స్టా‌లో ఈ మైలురాయిని సాధించిన తొలి ఐపీఎల్ ఫ్రాంచైజీగా నిలిచింది. ఆర్సీబీకి 13.5 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా.. ముంబైని13.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. సీఎస్కేకు ఎక్స్‌(ట్విట్టర్)లో 10.4 మిలియన్ ఫాలోవర్లు, ఫేస్‌బుక్‌లో 14 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.

Advertisement

Next Story