కోల్‌కతాపై చెన్నై భారీ విజయం..

by Mahesh |
కోల్‌కతాపై చెన్నై భారీ విజయం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 16వ సీజన్ లోని 33వ మ్యాచ్ కోల్‌కతా, చెన్నై మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు విజయం సాధించింది. మొదట టాస్ గెలిచిన KKR జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై జట్టు బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి.. 235 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంట్లో గైక్వాడ్ 35, కాన్వే 56, రహానే 71, దుబే 50, జడేజా..18, స్కోర్ చేశారు. కాగా 236 పరుగుల లక్ష్యంతో చేజింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేసింది. దీంతో చెన్నై 49 పరుగుల తేడాతో విజయం సాధించి ఊపీఎల్ 2023 పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మొదటి స్థానంలోకి చేరుకుంది.

Advertisement

Next Story