ఇంపాక్ట్ రూల్‌‌ను సమీక్షిస్తాం : ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్

by Harish |
ఇంపాక్ట్ రూల్‌‌ను సమీక్షిస్తాం : ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో అమలు చేస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను సమీక్షిస్తామని లీగ్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపాడు. ఇటీవల ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా విమర్శలు చేసిన నేపథ్యంలో అతను స్పందించాడు. తాజాగా జాతీయ మీడియాతో అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. ‘అమల్లో ఉన్న ఏ నియమానికికైనా లాభాలు, నష్టాలు ఉంటాయి. ఈ సీజన్ ముగిసిన తర్వాత చర్చకు సిద్ధంగా ఉన్నాం.’ అని చెప్పారు. గత సీజన్ నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను అమలు చేస్తున్నారు. ఈ రూల్ ప్రకారం.. ఆట జరుగుతున్నప్పుడు ఏ దశలోనైనా తుది జట్టులోని ఆటగాడికి ప్రత్యామ్నాయంగా వేరే ప్లేయర్‌ను తీసుకోవచ్చు. తాజాగా ఈ రూల్‌పై రోహిత్, బుమ్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల భారత ఆల్‌రౌండర్లకు నష్టం కలుగుతుందని రోహిత్ చెప్పగా.. బౌలర్లు తమ నైపుణ్యాలను పూర్తి స్థాయిలో ప్రదర్శించలేకపోతున్నారని బుమ్రా తెలిపాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఈ రూల్‌ను పున:సమీక్షించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed