IPL 2024: నేను అలా అనలేదు.. అంబటి రాయుడు ఫైర్..

by Disha Web Desk 3 |
IPL 2024: నేను అలా అనలేదు.. అంబటి రాయుడు ఫైర్..
X

దిశ వెబ్ డెస్క్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీల్ సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు ఆటగాళ్లపై పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇటీవల ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయం పాలైన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో LSG ఓటమికి రుతురాజ్ గైక్వాడ్ చెత్త కెప్టెన్సీనే ప్రధాన కారణమని అతనిపై క్రికెటర్ అంబటి రాయుడు విమర్శలు చేశారనే వార్తలు వెలుగు చూశాయి.

ఈ నేపథ్యంలో క్రికెట్ ధోని, బ్లేమ్ గైక్వాడ్ అంటూ నవజోత్ సిద్దు రాయుడిపై కౌంటర్లు కూడా వేశారు. అయితే తాజాగా తనపై వస్తున్న వార్తలపై అంబటి రాయుడు స్పందించారు. తాను అలా అనలేదని పేర్కొన్నారు. అసలు తాను ఆరోజు కామెంటరీనే చెయ్యలేదని స్పష్టం చేశారు. తాను ఆ రోజు తన తోటలో మామిడి పండ్లు కొస్తునట్టు పేర్కొన్నారు. ఓ వ్యక్తి గురించి ఏదైనా రాసేటప్పుడు బాధ్యతగా వ్యవహరించమని మండిపడ్డారు. ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చెయ్యకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed