ఇంపాక్ట్ రూల్‌తో బౌలర్లకు నష్టం : బుమ్రా

by Harish |
ఇంపాక్ట్ రూల్‌తో బౌలర్లకు నష్టం : బుమ్రా
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో ఇంపాక్ట్ రూల్‌తో బౌలర్లకు నష్టం కలుగుతుందని ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా తెలిపాడు. గురువారం పంజాబ్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత బుమ్రా మాట్లాడుతూ.. ‘సమయ పరిమితులు, ఇంపాక్ట్ రూల్‌తో బౌలర్లకు టీ20 ఫార్మాట్ కఠినంగా మారింది. బౌలర్లు సమర్థవంతంగా ప్రదర్శన చేయడానికి కష్టతరం అవుతుంది. ఈ రూల్ వల్ల బౌలర్ తన సామర్థ్యాలను సగం మాత్రమే ప్రదర్శించగలడు.’ అని బుమ్రా చెప్పాడు. కాగా, టీమ్ ఇండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ బ్యాటర్ రోహిత్ శర్మ కూడా ఇంపాక్ట్ ప్లేయర్‌ రూల్‌పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నిబంధన వల్ల భారత ఆల్‌రౌండర్లకు చేటు జరుగుతుందని చెప్పాడు.

Advertisement

Next Story

Most Viewed