- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఇదే మంచి టైమ్’.. కోహ్లీ రిటైర్మెంట్‌పై గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ-20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. శనివారం జరిగిన టీ-20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలిచిన అనంతరం విరాట్ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ క్రమంలో కోహ్లీ రిటైర్మెంట్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆదివారం గౌతీ ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీ-20 వరల్డ్ కప్ గెల్చుకున్న టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. ఫైనల్ మ్యాచ్‌లో ఒత్తిడి సమయంలోనూ భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారని కొనియాడారు. టీమిండియా ఆటగాళ్ల సమిష్టి ప్రదర్శనతో భారత్ 17 ఏళ్ల తర్వాత టీ-20 వరల్డ్ కప్ విశ్వవిజేతగా అవతరించిందని ప్రశంసించారు.
ఫైనల్ మ్యాచ్ అనంతరం టీ-20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్టార్ ప్లేయర్స్ కోహ్లీ, రోహిత్ శర్మల గురించి మాట్లాడుతూ.. విరాట్, రోహిత్‌లు టీ-20 ఫార్మా్ట్ నుండి వైదొలిగేందుకు వరల్డ్ కప్ ట్రోఫీ గెలవడం కన్నా మంచి సందర్భం ఇంకేమి ఉంటుందన్నారు. కోహ్లీ, రోహిత్ టీమిండియా వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించారని.. వారిద్దరూ ఈ ఫార్మాట్ నుండి తప్పుకోవడానికి ఇదే మంచి సమయం అని అభిప్రాయం వ్యక్తం చేశారు. టీ-20లకు రిటైర్మెంట్ ఇచ్చిన.. వన్డే, టెస్టుల్లో భారత్‌కు వీరు మరింత మెరుగైన సేవలు అందిస్తారని అన్నారు. టోర్నీ ఆసాంతంగా టీమిండియా అద్భుతంగా ఆడి కప్ గెలిచిందని అన్నారు.