కారు ఇవ్వలేదని పెళ్లి క్యాన్సిల్.. యువ వైద్యురాలు బలవన్మరణం

by GSrikanth |
కారు ఇవ్వలేదని పెళ్లి క్యాన్సిల్.. యువ వైద్యురాలు బలవన్మరణం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాబోయే భర్త కుటుంబ సభ్యులు అధిక కట్నం డిమాండ్‌ చేయడంతో ఓ యువ వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెలితే.. కేరళలోని తిరువనంతపురం మెడికల్ కాలేజీలో సర్జరీ విభాగంలో పీజీ చదువుతున్న సహానా (26)కు తన స్నేహితుడు, మెడికల్ పీజీ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధితో వివాహం నిశ్చయమైంది. అయితే, అబ్బాయి కుటుంబసభ్యులు 150 గ్రాముల బంగారం, 15 ఎకరాల భూమి, ఒక BMW కారు రూపంలో భారీ కట్నాన్ని డిమాండ్‌ చేశారు. అంత కట్నం ఇచ్చుకోలేమని సహానా కుటుంబం చెప్పడంతో వారు సంబంధాన్ని క్యాన్సిల్‌ చేసుకున్నారు.

దీంతో మనస్తాపం చెందిన సహానా ఇన్‌స్టిట్యూట్‌ సమీపంలోని అద్దె అపార్ట్‌మెంట్‌లో మంగళవారం ఉదయం బలవన్మరణానికి పాల్పడింది. సహానా మృతి వార్త తెలుసుకున్న రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించారు. పీజీ వైద్యురాలి ఆత్మహత్యపై విచారణ జరిపి నివేదికను సమర్పించాల్సిందిగా.. మహిళా శిశు సంక్షేమ శాఖను ఆదేశించారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు ఈ ఘటన తాజాగా దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed