- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యువకుడిది మృతి ప్రమాదమా.. హత్యనా..విచారణ చేస్తే విస్తు పోయే నిజాలు..!
దిశ,నారాయణపేట క్రైమ్: మూడో కంటికి తెలియకుండా మూసేద్దాం అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఓ యువకుడు చనిపోతే అనుకోని ప్రమాదం జరిగి చనిపోయాడని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే నారాయణపేట మండలం సింగారం చౌరస్తాలో నూతన కలెక్టరేట్ బిల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. అయితే ఈ బిల్డింగ్ పనులను బీహార్ రాష్ట్రానికి చెందిన లేబర్లు చేస్తున్నారు. ఈనెల 15వ తేదీన కలెక్టరేట్ నూతన భవన నిర్మాణ పనులు జరుగుతున్న చోట ఓ బీహారీ (లలన్)యువకుడు మృతి చెందాడు. యువకుడు మిషన్ లో పడి మృతి చెందాడని పోలీసులు చెబుతున్నారు. పక్కనే కలెక్టర్, అదనపు కలెక్టర్ అధికారిక నివాసాలు ఉన్నా ఆగస్టు 15 న కార్మికులతో భవన నిర్మాణ పనులు ఎలా చేయిస్తారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఉద్దేశపూర్వకంగానే యువకుడిని మిషన్ లో వేసి హత్య చేశారననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహం మిషన్ లో ఇరుక్కుంటే తీవ్ర ప్రయత్నం చేసి బయటకు తీసినట్లు తెలుస్తోంది. హత్య ఘటనను ప్రమాదంగా చిత్రీకరించి నిందితుడికి కలెక్టర్ భవన నిర్మాణ గుత్తేదారు మేలు చేకూరేలా విశ్వ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. పై స్థాయి అధికారులు పూర్తి స్థాయి విచారణ చేస్తే విస్తు పోయే నిజాలు బహిర్గతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం పై కాంట్రాక్టర్ రిషికేశ్ ను విలేకరులు వివరణ కోరగా ప్రమాదవశాత్తు జరిగిందని హత్య కాదని సమాధానం ఇచ్చారు. హుటాహుటిన మృతదేహాన్ని బీహార్ కు పంపినట్లు తెలుస్తుంది. ఈ విషయంపై నారాయణపేట సీఐ శివ శంకర్ ను 'దిశ' వివరణ కోరగా క్లీనింగ్ పనులు చేస్తుంటే ప్రమాదవశాత్తు యువకుడు మృతి చెందాడని హత్య కాదని ఈ ఘటనపై మృతుడి మామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.