- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
సంచలన ఘటన.. చేతబడి నెపంతో ఐదుగురిని దారుణంగా హత్య చేసిన గ్రామస్తులు
దిశ, వెబ్ డెస్క్: చేతబడి(black magic) నెపంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని గ్రామస్తులు దారుణంగా హత్య చేశారు. ఈ సంచలన ఘటన ఛత్తీస్గఢ్(Chhattisgarh)లోని సుక్మా జిల్లా(Sukma District)లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సుక్మా జిల్లా కుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇట్కల్ గ్రామంలో ఓ కుంటుంబంలోని వ్యక్తులు చేతబడి(black magic) చేస్తున్నారని.. వారి మంత్రాల కారణంగా తమ కుటుంబ సభ్యుడు అనారోగ్యానికి గురయ్యాడు అనే అనుమానంతో కుటుంబంపై గ్రామస్తులు మొత్తం దాడి చేశారు. గ్రామస్తుల దాడి లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ హత్యల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని.. దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా చేతబడి అనుమానంతో.. కుటుంబంపై దాడి చేసి ఐదుగురిని హత్య చేయడంతో సుక్మా జిల్లాలో సంచలనంగా మారింది.