Accident : బైక్ ను ఢీ కొన్న గుర్తుతెలియని వాహనం.. వ్యక్తి మృతి..

by Sumithra |
Accident : బైక్ ను ఢీ కొన్న గుర్తుతెలియని వాహనం.. వ్యక్తి మృతి..
X

దిశ, పెబ్బేరు : మున్సిపాలిటీలోని ఎన్హెచ్ 44 మోడల్ స్కూల్ దగ్గర గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనం పై వెళ్తున్న పెబ్బేర్ అంబేద్కర్ నగర్ కు చెందిన మధు అనే యువకుడు మరణించాడు. వివరాల్లోకి వెళితే పెబ్బేర్ అంబేద్కర్ నగర్ కు చెందిన వెంకటయ్య బాలమ్మలకు ఇద్దరు కుమారులు. వారి చిన్న కుమారుడు పెబ్బేర్ పూలు ఫోటో స్టూడియోలో పనిచేస్తున్నాడు. పని నిమిత్తం పక్కగ్రామంతో మాలపల్లికి మోటార్ సైకిల్ పై AP 22 AP #673 వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి తల పై టైరు పోవడంతో మెదడు చిట్లి అక్కడికక్కడే మరణించాడు. NH అథారిటీ వారి అంబులెన్స్ లో పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా హాస్పిటల్ కి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed