- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ganja : గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
దిశ, మెట్ పల్లి : గంజాయి తరలిస్తూ పోలీస్ లకు పట్టుపడిన ఘటన మెట్ పల్లిలో చోటు చేసుకుంది. మెట్ పల్లి డీఎస్పీ ఉమా మహేశ్వర్ రావ్ తెలిపిన వివరాల ప్రకారం... మెట్ పల్లి పట్టణం డీడీ నగర్ కు చెందిన మాగిని దేవనర్సయ్య, దుబ్బవాడ కు చెందిన కోరే రాజు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెంకట్రావుపేట్ (మెట్ పల్లి ) గౌతమ్ ఫ్యూయల్ ఎంటర్ప్రైజెస్-HP పెట్రోల్ బంక్ (HPCL) వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా వీరు గంజాయితో వస్తూ పోలీస్ లను
చూసి పారిపోయే క్రమంలో మెట్ పల్లి ఎస్సై చిరంజీవి వారిని పట్టుకున్నారని తెలిపారు. నిందితుల వద్ద 5000 వేల విలువ గల 100 గ్రాముల గంజాయి , రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, రెండు మొబైల్ ఫోన్ లను స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. అంతే కాకుండా మెట్ పల్లి, కోరుట్ల పట్టణ పరిసర ప్రాంతాలలో ఎవరైనా గంజాయిని సరాఫరా చేసినా, అమ్మినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయిని పట్టుకున్న ఎస్ఐ చిరంజీవి, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో డీఎస్పీ వెంట కోరుట్ల సీఐ సురేష్ బాబు, మెట్ పల్లి ఎస్ఐ చిరంజీవి, పీసీలు రమేష్, మల్లేష్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
- Tags
- ganja