- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరు మృతి
దిశ, అందోల్: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఐదుగురికి గాయాలైన ఘటన శుక్రవారం అందోలు మండలం డాకూరు జాతీయ రహదారిపై జరిగింది. ఈ ఘటనకు సంబందించి ఏఎస్‌ఐ గౌస్ తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివపేట మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన చెంద్రయ్య(60), తన భార్య మణెమ్మతో కలిసి టివిఎస్ ఎక్సల్ వాహనంపై అందోలు మండలం బ్రహ్మణపల్లి గ్రామానికి బంధువుల ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో సంగుపేట వద్ద సర్వీసు రోడ్డు గుండా వెళ్లాల్సి ఉండగా బ్రిడ్జీ ఎక్కి కొంత దూరం ప్రయాణించి రాంగ్‌రూట్‌లో వెళ్తున్నామని గ్రహించి వెంటనే రోడ్డు పక్కన నిలిపుకోగా అదేవైపుగా హైద్రాబాద్ నుండి నారాయణఖేడ్ వైపు వస్తున్న మరో బైక్ ఢీకొట్టింది. దీంతో చెంద్రయ్యకు తీవ్ర గాయాలవగా, అతని భార్య మణెమ్మతో పాటు మరో బైక్‌పై ఉన్న విజయ్ అతని భార్య నవ్య వారి చిన్నారులు శిరీష, ఆర్యన్ కి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది వారిని జోగిపేట ప్రభుత్వ తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం సంగారెడ్డికి తరలించగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చెంద్రయ్య మతి చెందాడు. ఈ ఘటనపై మృతుని కుమారుడు మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.