HYD: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

by GSrikanth |
HYD: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ టిప్పర్ అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును ఆరా తీస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, రోడ్డు ప్రమాదాలపై తరచూ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నా వాహనదారులు అవగాహన తెచ్చుకోవడం లేదు. ర్యాష్ డ్రైవింగ్‌లో ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీంతో పోలీసులు మరన్నీ జాగ్రత్తలు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed