జమ్మూ‌ కశ్మీర్‌లో విషాదం: ఇల్లు కూలి తల్లి సహా ముగ్గురు పిల్లలు మృతి

by samatah |
జమ్మూ‌ కశ్మీర్‌లో విషాదం: ఇల్లు కూలి తల్లి సహా ముగ్గురు పిల్లలు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లో విషాదం చోటు చేసుకుంది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రియాజీ జిల్లాలోని కుందర్‌ధన్ మోహ్రా గ్రామంలో ఓ పాత ఇళ్లు ఆదివారం కూలిపోయింది. దీంతో ఆ ఇంట్లో ఉన్న తల్లి, ఆమె ముగ్గురు కుమార్తెలు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిని ఫల్లా అఖ్తర్ (30), ఆమె కుమార్తెలు నసీమా (5), సఫీనా కౌసర్ (3), సమ్రీన్ కౌసర్ (2)గా అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో అదే కుటుంబంలోని మరో ఇద్దరు వృద్ధులకు తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు చేపట్టిన రెస్యూ టీం శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీశారు. కాగా, గత మూడు రోజులుగా కశ్మీర్‌లో భారీ వర్షాలు, మంచు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో పలు చోట్ల కొండ చరియలు విరిగిపడటం, హిమపాతం సంభవించడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనల్లో అనేక ఇళ్లు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. మరోవైపు జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి వరుసగా రెండో రోజూ మూసివేశారు.

Advertisement

Next Story

Most Viewed