- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
దిశ, నవాబుపేట /రాజాపూర్: పండగ పూట నవాబుపేట మండల పరిధిలోని కారూరు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. రాజాపూర్ మండల పరిధిలోని కుచ్చర్ కల్ గ్రామం వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన గోపనమోని జంగయ్య (35) అక్కడికక్కడే మృతి చెందగా ఆయన నడుపుతున్న బైక్ పై ఆయన వెంట వచ్చిన అదే గ్రామానికి చెందిన మైబు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన మైబు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
వినాయక చవితి పర్వదినం సందర్భంగా జడ్చర్ల పట్టణంలో ఆకులు, అలములు, పూలు లాంటి పూజా సామాగ్రిని అమ్ముకుని తిరిగి గ్రామానికి జంగయ్య వస్తుండగా రాజాపూర్ గ్రామం దగ్గర ఆయనను లిఫ్ట్ అడిగి మైబు ఆయన బైక్ పై ఎక్కారు. అక్కడినుండి కుచ్చర్ కల్ గ్రామం వద్దకు చేరుకున్న జంగయ్య ముందు వెళ్తున్న స్కూటీ బైకును ఢీ కొట్టి అదుపుతప్పి బోల్తా పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన వెంట ప్రయాణించిన మైబు తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడు జంగయ్య కు భార్య లావణ్య, ఇద్దరు కుమారులు కలరు. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడం తో పాటు మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలై ఆసుపత్రి పాలు కావడంతో మండల పరిధిలోని కారూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.