బజ్జి అమావాస్య వేళ పాఠశాలలకు తాళాలు..

by Kalyani |
బజ్జి అమావాస్య వేళ పాఠశాలలకు తాళాలు..
X

దిశ, నారాయణఖేడ్: ప్రభుత్వం నిరుపేదల విద్యార్థుల కోసం కోట్లు ఖర్చు చేసి పాఠశాల భవనాలు నిర్మించి ఉపాధ్యాయులను ఏర్పాటు చేస్తే దానికి విరుద్ధంగా ఉపాధ్యాయులు మాత్రం పాఠశాలలకు రాకుండానే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. నిరుపేద విద్యార్థులు చదువుకు దూరం కాకుండా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ప్రభుత్వం చేస్తే ఉపాధ్యాయులు మాత్రం దానికి విరుద్ధంగా సోమవారం బజ్జి అమావాస్య వేల పాఠశాలలకు తాళాలు వేశారు. చదువుకోవడానికి విద్యార్థులు వస్తే పాఠశాల మూసివేయడంతో వెను తిరిగి వెళ్లిపోయారు. కర్ణాటక సరిహద్దులో ఉన్న నాగల్ గిద్ద మండలంలోని కారముంగి కాంప్లెక్స్ లోని ఏ స్కి, ఔదాత్ పూర్, గౌడిగామ పాఠశాలలు బజ్జి అమావాస్య సందర్భంగా తాళాలతో దర్శనమిచ్చాయి. కర్ణాటక సరిహద్దులో ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులు రాక బంద్ ఉన్నాయని అనేక సందర్భంలో ఆరోపణలు వచ్చాయి.

వర్షం, చలి కాలంలో అయితే పాఠశాలలకు ఎప్పుడో చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు ఎన్ని మార్లు తెలిపిన పట్టించుకున్న దాఖలు లేవని తల్లిదండ్రులు వాపోయారు. మారుమూల ప్రాంతానికి ఎవరు రాని ఉపాధ్యాయులకు తెలియడంతో డుమ్మా కొడుతున్నారు. మారుమూల ప్రాంతానికి చెందిన విద్యార్థులు శ్రద్ధతో చదువుకోవాలని ఉంటే ఉపాధ్యాయులు అమావాస్యకో పున్నమికో చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోతున్నారు. శ్రద్ధతో చదువుకుందామని ఇక్కడకు వస్తే స్కూల్ కు తాళాలు వేసి ఉన్నాయని చూసి వెను తిరిగారు. కాగా సంబంధిత అధికారులు దీనిపై వెంటనే స్పందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మనూర్ , కంగ్టి, మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఉపాధ్యాయులు పాఠశాలలకు డుమ్మలు కొట్టి బందర్ కొందరు ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. స్థానిక ఎంఈఓ మన్మధ కిషోర్ కు వివరణ కోరగా లోకల్ హాలిడే తీసుకున్నమని ఉపాధ్యాయులు తెలిపారని, మంగళవారం ఉపాధ్యాయులతో పూర్తి సమాచారం తీసుకొని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Next Story