- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్లీజ్..నన్ను, నా పిల్లలను చావనివ్వండి
దిశ, నల్లగొండ క్రైం : నల్లగొండ టాస్క్ఫోర్స్ ఎస్ఐను తను రెండవ వివాహం చేసుకున్న విషయం ఆయన మొదటి భార్య జ్యోతి తో పాటు వారి కుటుంబ సభ్యులకు తెలుసని ఎస్ఐ మహేందర్ రెండవ భార్య జాల వసంత తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో తన పిల్లలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తనుకు మెుదటి వివాహమైన ఏడేళ్ల తర్వాత నా భర్తతో కొన్ని కారణాలవల్ల విడాకులు తీసుకున్నానని తెలిపారు. అనంతరం పరిచయమైన ఎస్సై మహేందర్ ను ఇష్టపడి 2014 ఏప్రిల్ 12వ తేదీన శ్రీశైలంలో ప్రేమ వివాహం చేసుకున్నానన్నారు. వివాహం చేసుకున్న కొద్ది రోజుల తర్వాత ఈ విషయం ఆయన మొదటి భార్య జ్యోతితో పాటు..వారి కుటుంబ సభ్యులకు సైతం తెలుసన్నారు. ఈ విషయంలో మొదట గొడవ జరిగిన ఆ తర్వాత ఆమెకు పిల్లలు లేకపోవడంతో..తన వివాహాన్ని అంగీకరించి వేరువేరుగా ఉండేందుకు ఒప్పుకున్నారన్నారు. తన పెద్ద పాప పుట్టిన ఆరేళ్ల తర్వాత జ్యోతికి ఐవీఎఫ్ ద్వారా పిల్లలు పుట్టారన్నారు. ఆమెకు పిల్లలు పుట్టిన తర్వాత నన్ను దూరంగా పెట్టాలని పలుమార్లు ఇబ్బందులకు గురి చేసిందన్నారు. జ్యోతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు తనను మానసికంగా చాలా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. 2016 లోనే ఎస్సైగా మహేందర్ సైబరాబాద్ కమిషనరేట్ లో పనిచేస్తున్న సమయంలో జ్యోతి అప్పుడు కమిషనర్ కు ఫిర్యాదు చేయగా.. క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేశారు. దీంతో ఆరు నెలలు విధులకు దూరంగా ఉన్నారన్నారు. అనంతరం పోలీసు అధికారులతో పాటు పెద్ద మనుషుల సమక్షంలో కూడా పలుమార్లు మాట్లాడుకున్నామని తెలిపారు. ప్రస్తుతం తనకు 12 ఏళ్లు కూతురు,ఏడేళ్ల బాబు ఉన్నాయన్నారు. కావాలనే తనను పిల్లలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని,ఈ వేధింపులు భరించడం తమ వల్ల కావడంలేదని ఆరోపించారు. తనను, పిల్లలను చావనివ్వండని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే తన పిల్లలకు డిఎన్ఏ టెస్ట్ చేయాలని,పిల్లలు మహేందర్ కు పుట్ట లేదంటే వెంటనే వెళ్ళిపోతానని స్పష్టం చేశారు.నన్ను, నా పిల్లలను చావనివ్వండి