- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Assembly: మన్మోహన్ పాలనలోనే భూసేకరణ చట్టం.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : మన్మోహన్ సింగ్(Manmohan Singh) పాలనలోనే విప్లవాత్మక భూసేకరణ చట్టం తెచ్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) తెలిపారు. ల్యాండ్ అక్విడేషన్ యాక్టు విషయంలోనూ ల్యాండ్ మార్క్ తీసుకొచ్చారని తెలిపారు. మాజీప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ కు సోమవారం అసెంబ్లీలో సంతాప ప్రతిపాదనపై మాట్లాడారు. దేశ క్షేమం కోసం మన్మోహన్ సింగ్ న్యూక్లియర్ ఇప్పందం కుదుర్చుకున్నారన్నారు. అడవిబిడ్డలకు ఫారెస్టు యాక్ట్ తీసుకొచ్చారన్నారు. మన్మోహన్ సింగ్ మృతి దేశానికి , తెలంగాణకు తీరని లోటన్నారు. దేశంలో రైతు రుణమాఫీ చేసిన తొలిప్రధానిగా ఆయనకే దక్కిందన్నారు.
ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే ఉపాధిహామీ చట్టం తెచ్చారని, ప్రభుత్వంలో ఉన్నవారు జవాబుదారి తనంగా ఉండాలని ఆర్టీఐ చట్టం తెచ్చారన్నారు. రైట్ టు ఎడ్యూకేషన్ చట్టం, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తెచ్చారన్నారు. నాడు మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు. దృఢ సంకల్పంతో ముందుకు పోవడంతోనే తెలంగాణ వచ్చిందని వెల్లడించారు. తెలంగాణ బిల్లును లోక్ సభలో, రాజ్యసభలో ఆమోదించడంలో మన్మోహన్ సింగ్ కీలకంగా వ్యవహరించారన్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రాజధాని అని తేల్చిచెప్పారన్నారు. నిరాడంబరుడు మన్మోహన్ సింగ్ అని, హైదరాబాద్ లో ఆయన విగ్రహ ఏర్పాటు సముచిత నిర్ణయం అన్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.