రేపే న్యూ ఇయర్ వేడుకలు.. ఆదాయం పై ఎక్సైజ్ శాఖ, శాంతిభద్రతలపై పోలీస్ శాఖ దృష్టి

by Mahesh |   ( Updated:2024-12-30 16:32:13.0  )
రేపే న్యూ ఇయర్ వేడుకలు.. ఆదాయం పై ఎక్సైజ్ శాఖ, శాంతిభద్రతలపై పోలీస్ శాఖ దృష్టి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త సంవత్సర వేడుకలపై పోలీస్ డిపార్ట్మెంట్ గస్తీ ముమ్మరం చేసింది. పోలీస్, ఎక్సైజ్, ట్రాఫీక్, టీజీన్యాబ్‌ అన్ని శాఖలు న్యూఇయర్ వేడుకలలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తత పాటిస్తున్నాయి. ఇప్పటికే పోలీస్ అధికారులు ఈవెంట్ల నిర్వహణ పై ప్రకటలు చేశారు. పబ్స్, హోటల్స్ పై ప్రత్యేక దృష్టి సారించారు. ట్రాఫిక్ అంక్షల పై సమాచారం అందించారు. ఓఆర్ ఆర్ పై వాహనాల అనుమతి పై ఆంక్షలు విధించారు. ఎయిర్ పోర్ట్ వైపు వెళ్లే వారు ఖచ్చితంగా ఫ్లైట్ టికెట్ చూపిస్తేనే ఫ్లైఓవర్ల పై అనుమతి ఉందిని తెలిపారు.

ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దృష్టి ..మద్యం అమ్మకాల పై రూ.1000 కోట్ల టార్గెట్

ఎక్సైజ్‌తో టీజీన్యాబ్‌ ఇతర నిఘా బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు, ఎక్సైజ్‌ శాఖ నుంచి 42 ప్రత్యేక టీమ్‌ల ఏర్పాటు చేసినట్లు ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి తెలిపారు. నాన్‌ డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌, డ్రగ్స్‌పై, అనుమతి లేని ఈవెంట్‌ పార్టీలపై నిఘాఉంటుందని తెలిపారు. అదే విధంగా రెండు రోజుల్లో ఎక్సైజ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా రూ.1000కోట్ల టార్గెట్‌గా అమ్మకాలు జరిగేలా చర్యలు చెపట్టినందని తెలుస్తుంది. ప్రధానంగా డిసెంబరు 31 రాత్రి జరుపుకునే సంబరాల్లో ఎవ్వరైనా తెలంగాణ మద్యం వాడకం బదులు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న మద్యం వినియోగిస్తే కఠిన చర్యలు, కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

మద్యంతో పాటు ఎవరైన గంజాయి, డ్రగ్స్‌ను వినియోగిస్తే కూడ కేసులు నమోదు చేస్తామని తెలుపుతున్నారు. పబ్బులు, బార్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో జరిగే కొత్త సంవత్సర వేడుకల్లో ఎక్సైజ్‌ టీమ్‌లు వినియోగించే మద్యంపై కొత్త టెక్నాలజీ యాప్‌లతో తనిఖీలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. మద్యం దుకాణాలకు రెండు రోజుల పాటు రాత్రి 12 గంటల వరకు, బార్లు పబ్బులకు 1 గంట వరకు అనుమతులు ఇచ్చారు.

జీరో టాలరెన్స్ డ్రగ్స్ : మాదాపూర్ ఎస్వోటీ డీసీపీ శోభన్ కుమార్

మాదాపూర్ జోన్‌లో నూతన సంవత్సరం సందర్భంగా ఈవెంట్స్ నిర్వహించే ఆర్గ‌నైజర్స్‌తో మాదాపూర్ ఎస్వోటీ డీసీపీ శోభన్ కుమార్ సమావేశం నిర్వంచారు. జీరో టాలరెన్స్ డ్రగ్స్, సౌండ్ పొల్యూషన్, ఫైర్ సేఫ్టీ, ఉమెన్ సేఫ్టీ , టైమ్ షెడ్యూల్ , సీసీ టీవీ ల ఏర్పాటు, అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తత, క్రౌడ్ మేనేజ్మెంట్, పలు అంశాల పై సూచనలు చేశారు.

*ట్రాఫిక్ నిబంధనలు

31 డిసెంబర్ 2024 న నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కొన్ని పరిమితులు, మార్గదర్శకాలను ట్రాఫిక్ పోలీసులు జారీ చేశారు..

*పీవిఎన్ ఆర్ ఎక్స్‌ప్రెస్ వే రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం వైపు వెళ్లే వాహనాలు మినహా, ఇతర వాహనాల కోసం అనుమతించబడవని నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు మూసివేయబడుతుందని తెలిపారు.

* క్యాబ్‌లు/టాక్సీ/ఆటో రిక్షాల డ్రైవర్లు/ఆపరేటర్లు సరైన యూనిఫారంలో ఉండాలి, వారి అన్ని పత్రాలను తీసుకెళ్లాలన్నారు. ప్రజలతో అనుచితంగా ప్రవర్తించకూడదు లేదా అదనపు ఛార్జీలు డిమాండ్ చేయకూడదని తెలిపారు.

* రాంగ్ సైడ్ డ్రైవింగ్, రాంగ్/అనధికార పార్కింగ్, ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్, ర్యాష్ డ్రైవింగ్ , హెల్మెట్ లేకుండా రైడింగ్ వంటి ప్రమాదకరమైన ఉల్లంఘనలను గుర్తించడానికి ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి, ఎవరైనా ఈ ఉల్లంఘనలను ఉల్లంఘించినట్లు గుర్తించబడితే, ఈ కెమెరాల ద్వారా గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటమని తెలిపారు.

* రాత్రి 8 గంటల నుంచి సైబరాబాద్ పరిమితుల్లోని అన్ని రోడ్లలో డ్రంక్, డ్రైవింగ్ విస్తృత తనిఖీలు నిర్వహించబడతాయి. వాహన డ్రైవర్లు ఆపి పత్రాలను చూపించడంతో పాటు చట్ట ప్రకారం పబ్లిక్ రోడ్లపై ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించడం వారి విధి. ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.


Read More..

New Year Celebrations : సరదాగా గడిపేద్దాం.. 2024కు గుడ్ బై చెప్పేద్దాం..

Advertisement

Next Story