- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Maoists : ముగ్గురు మావోయిస్టులు, ఓ సానుభూతి పరుడు అరెస్ట్
దిశ, భద్రాచలం : ఏసీఎం తో సహా ముగ్గురు మావోయిస్టులతో పాటు వారికి సహకరిస్తున్న ఒక సానుభూతి పరున్ని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరెస్టు చేసిన మావోయిస్టులను ప్రవేశపెట్టి వివరాలు తెలిపారు. జూలై 25వ తేదీన దామర తోగు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో తప్పించుకుని తిరుగుతున్న ఏసీఎం పొట్టం రాజు, ఓఎం పాండు, పూణేం చుక్కి, మావోయిస్టు సానుభూతిపరుడు దామర్ ను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా వీరు పోలీసులను చూసి దాక్కోవడానికి ప్రయత్నం చేయడంతో అనుమానం వచ్చిన పోలీసులు వారిని పట్టుకొని ప్రశ్నించడంతో మావోయిస్టు పార్టీకి చెందిన వారమని, ఈ ప్రాంతంలో మావోయిస్టు పార్టీని విస్తరించేందుకు రావడం జరిగిందని ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వీరందరూ గతంలో పలు హింసాత్మక ఘటనలలో పాల్గొన్నారని,వీరి వద్ద నుండి ఆయుధాలతో పాటు, మావోయిస్టు పార్టీకి సంబంధించిన కరపత్రాలు, సామాగ్రి స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్టు తెలిపారు. మావోయిస్టు పార్టీకి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- Tags
- Maoists