- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
gold seized : టోల్ ప్లాజా వద్ద తనిఖీల్లో భారీగా దొరికిన బంగారం..
దిశ, చౌటుప్పల్ : రెండున్నర కోట్లు విలువ చేసే మూడున్నర కిలోల బంగారాన్ని రవాణా చేస్తున్న ముఠాను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకెళ్తే చెన్నై నుండి బీదర్ కు కారులో అక్రమంగా విదేశీ బంగారాన్ని తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద గురువారం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు నిఘా పెట్టారు.
గురువారం పంతంగి టోల్ ప్లాజా వద్ద అనుమానాస్పద మారుతి సుజుకి కారును ఆపి అందులో తనిఖీలు నిర్వహించారు. కారును క్షుణ్ణంగా పరిశీలించగా కారు హ్యాండ్ బ్రేక్ కింద ప్రత్యేకంగా ఒక కుహురం ను ఏర్పాటు చేసి అందులో 3.5 కిలోల (3577 గ్రాముల) బరువున్న ఐదు బంగారు కడ్డీలను గుర్తించారు. వీటి విలువ 2, 51,46,310 రూపాయలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి 3.5 కిలోల బంగారం, మారుతి కారు స్వాధీనం చేసుకొని కస్టమ్స్ చట్టం 1962 నిబంధనల ప్రకారం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు తెలిపారు.