Theft of phones: 10 ఐఫోన్లు కొట్టేసిన డెలివరీ బాయ్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన కంపెనీ

by Shiva |
Theft of phones: 10 ఐఫోన్లు కొట్టేసిన డెలివరీ బాయ్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన కంపెనీ
X

దిశ, శేరిలింగంపల్లి: కొరియర్‌లో వచ్చిన ఫోన్లను ఓ డెలివరీ బాయ్ కొట్టేసిన ఘటన చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం మేరకు.. ఓ కొరియర్ కంపెనీలో డెలివరీ బాయ్‌గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తికి ఇటీవల ఓ కంపెనీ ఆర్డర్ చేసిన 10 ఐఫోన్లతో కూడా ప్యాకేజ్ వచ్చింది. అయితే, అందులో ఐఫోన్లు ఉన్నాయని గమనించిన డెలివరీ బాయ్ వాటిని సైలెంట్‌గా తస్కరించాడు. ఫోన్లను ఆర్డర్ చేసిన కంపెనీ విషయాన్ని ఆలస్యంగా గుర్తించి చందానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం కేసు నమోదు చేసుకుని డెలివరీ బాయ్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐ పాలవెల్లి తెలిపారు.

Advertisement

Next Story