- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
gold shop : బంగారం షాప్ లో భారీ దొంగతనం.. 18 లక్షల విలువ గల అభరణాలు చోరీ..
దిశ, శామీర్ పేట : ఓ షాపులో సుమారు 18 లక్షల విలువైన బంగారు ఆభరణాలను గుర్తుతెలియని దుండగులు దొంగిలించారు. ఈ సంఘటన షామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తూముకుంట మున్సిపాలిటీలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు తూముకుంట మున్సిపాలిటీ కేంద్రంలో గణేష్ కృష్ణ జువెల్లరీ షాపును నిర్వహిస్తున్నారు. రోజువారి మాదిరిగా మంగళవారం షాప్ నకు తాళాలు వేసి వెళ్ళిపోయారు. బుధవారం ఉదయం షాప్ తాళం విరగొట్టి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు షట్టర్ తాళం విరగ్గొట్టి రాడు సహాయంతో షట్టర్ ను పైకి లేపి దొంగతనానికి పాల్పడి ఉంటారని నిర్ధారించుకున్నారు.
పోలీసులు క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. షాప్ లో ఉన్న దాదాపు 46 తులాల బంగారం నగలు, 80 కిలోల వెండి నగలు, కొంత నగదుతో పాటు సీసీ కెమెరాల ఫుటేజ్ ని ఎత్తుకెళ్లారని బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. దీంతో సంఘటన స్థలాన్ని బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్, మేడ్చల్ అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి, పెట్ బషీర్బాగ్ ఏసీపీ రాములు, స్థానిక సీఐ శ్రీనాథ్ రెడ్డిలో సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. దాదాపు ముగ్గురు వ్యక్తులు ఆ దొంగతనానికి పాల్పడి ఉంటారని వారిని పట్టుకునేందుకు పది టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు.