- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆపరేషన్ థియేటర్‌లో మృతి చెందిన మహిళ.. డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన..
దిశ, జగిత్యాల టౌన్ : శస్త్ర చికిత్స కోసం ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకు వెళ్లిన మహిళ మత్తు ఇంజక్షన్ ఇవ్వగానే మృతి చెందిన సంఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. మల్యాల గ్రామానికి చెందిన వంగల మహిత (38) మూడు రోజుల క్రితం జగిత్యాల లోని శాంతి హాస్పిటల్ లో గర్భసంచి ఇన్ఫెక్షన్ నొప్పితో బాధపడుతూ అడ్మిట్ అయింది. గురువారం శస్త్ర చికిత్స చేసేందుకు 12:30గంటల సమయంలో ఆపరేషన్ థియేటర్ కు షిఫ్ట్ చేశారు.
ఆ తర్వాత కొద్దిసేపటికే మహిళ మృతి చెందినట్లు డాక్టర్లు పేషెంట్ బంధువులకు తెలియజేశారు. అయితే మత్తుమందు వికటించడంతోనే మహిత మృతి చెందిందని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని న్యాయం చేస్తామని నచ్చ చెప్పారు. కాగా మృతురాలికి భర్త రమేష్, 13 ఏళ్ల కూతురు మైథిలి 11 ఏళ్ల కొడుకు సాయి ఉన్నారు. అయితే ఈ ఘటన పై సంబంధిత ఆసుపత్రికి వైద్యులు మాత్రం సర్జరీ సమయంలో హార్ట్ ఎటాక్ వచ్చి మృతి చెందినట్లు చెబుతున్నారు.