తండ్రిని పెట్రోల్ పోసి తగులబెట్టిన కుమారుడు.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే!

by GSrikanth |
తండ్రిని పెట్రోల్ పోసి తగులబెట్టిన కుమారుడు.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే!
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రిపై కుమారుడు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. అయితే, గత కొంతకాలంగా కుమారుడు డ్రగ్స్‌కు బానిసైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే తరచూ తండ్రి, కుమారుల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయని స్థానికుల ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ డ్రగ్స్ విషయమై తండ్రి కాస్త గట్టిగా మందలించడంతో ఆగ్రహానికి గురైన కుమారుడు తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story