దారుణం.. తాగుడు వద్దన్నందుకు తల్లిని చంపిన తనయుడు

by Aamani |
దారుణం.. తాగుడు వద్దన్నందుకు తల్లిని చంపిన తనయుడు
X

దిశ,పేట్ బషీరాబాద్: మద్యానికి బానిసైన కొడుకు నివారించేందుకు కన్నతల్లిని కొట్టి చంపిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుత్బుల్లాపూర్ గ్రామానికి చెందిన పెద్ది వేణు కుమార్ (32) మద్యం తాగి వచ్చి తరచుగా ఇంట్లో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఇతని భార్య సైతం సంవత్సరం క్రితం ఇతనిని వదిలేసి వెళ్ళిపోయింది. దీంతో పూర్తిగా మద్యానికి బానిసైన వేణు బుధవారం సాయంత్రం ఇంటిలో తల్లి జయమ్మ (63) తో గొడవ పడ్డారు. ఎప్పుడు పడితే అప్పుడు రోజు తాగడమేనా అంటూ తల్లి జయమ్మ తీవ్రంగా మందలించడంతో వేణు కుమార్, డోర్ వెనుక ఉండే బోల్ట్ తో నుదుటిపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు వేణు ని అదుపులోకి తీసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed