తీవ్ర విషాదం..పెళ్లైన 5 రోజులకే వరుడు మృతి

by Jakkula Mamatha |
తీవ్ర విషాదం..పెళ్లైన 5 రోజులకే వరుడు మృతి
X

దిశ,వెబ్‌డెస్క్:పెళ్లి అనేది అందరి జీవితంలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. వివాహ బంధంతో(Marriage) రెండు మనసులు ఒకటవుతాయి. నిండు నూరేళ్లు వారిద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఈ క్రమంలో పెళ్లికి వచ్చే పెద్దలు కూడా నిండు మనస్సుతో నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. ఎన్నో కోరికలతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన ఓ నవవధువుకు తీరని కష్టం వచ్చింది. వివరాల్లోకి వెళితే..కర్ణాటకలోని వెంగసంద్రాకు చెందిన కార్తీక్‌ (28) అనే యువకుడికి చిత్తూరు జిల్లా(Chittoor District) రామకుప్పం మండలం కొల్లుపల్లికి చెందిన భవానితో ఐదు రోజుల కిందట వివాహం జరిగింది.

ఈ క్రమంలో పెళ్లైన(Marriage) ఐదో రోజు కార్తిక్‌ తన భార్యను తీసుకుని అత్తారింటికి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కార్తీక్‌ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో భార్యను తీసుకుని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు క్లినిక్‌కు వెళ్లాడు. అక్కడే చికిత్స పొందుతూ మరణించాడు. గుండెపోటు(heart attack) కారణంగా కార్తీక్‌ చనిపోయాడని పలువురు అనుమానిస్తున్నారు. అయితే కార్తీక్‌ మరణవార్త తెలుసుకుని అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రి వద్ద మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అతను కేవలం గ్యాస్ట్రిక్‌ సమస్యతో(gastric problem) ఇబ్బంది పడ్డారని చెప్పారు. కానీ వైద్యులు సరైన వైద్యం అందించలేదని ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed