- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆకేరు నదిలో గల్లంతైన యువ శాస్త్రవేత్త మృతి..కానరాని తండ్రి జాడ.!
దిశ,మరిపెడ : ఊహించని నీటి ప్రవాహం ఆశల పల్లకిని మింగేసింది. వ్యవసాయ కుటుంబంలో జన్మించి వ్యవసాయ మెలుకువల్లో జాతీయస్థాయిలో సత్తా చాటి బంగారు పథకాలు పంట పండించింది. పుట్టిన ఊరుకు కన్న తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకురావడమే కాకుండా ఏందోరో యువ శాస్త్రవేత్తలను తీర్చిదిద్దాలి అనుకున్నా కాలం కనికరించలేదు.పూర్తి వివరాల్లోకి ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారం తండాకు చెందిన నునావత్ అశ్విని జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ లో ఢిల్లీలో యువ శాస్త్రవేత్త గా విధులు నిర్వహిస్తుంది.తన సోదరుని ఎంగేజ్మెంట్ కోసం వచ్చి ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కారులో తన తండ్రి మోతీలాల్ తో కలిసి డోర్నకల్,చింతలపల్లి, మరిపెడ, సూర్యాపేట మీదుగా హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకోవాలనుకున్నది.
తిరిగి వెళ్లే క్రమంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయ గూడెం హై లెవెల్ బ్రిడ్జి పై ఊహించని విధంగా ఆకేరు నది వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో వరద ప్రవాహం లో కారు కొట్టుకపోవడమైంది.చివరి నిమిషాల్లో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన అశ్విని కారు కొట్టుకుపోతుంది మా..మెడ వరకు నీరు వచ్చిందంటూ తెలిపిన కొద్ది సెకండ్లలోనే ఫోన్ కట్ అయినట్టు వారి బంధువులు తెలిపారు. తిరిగి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ రావడంతో కుటుంబ సభ్యుల్లో భయంతో కూడిన ఆందోళన నెలకొంది.చివరకు ఆదివారం (ఈ రోజు)సాయంత్రం పూట ఆ బ్రిడ్జికి కొద్ది దూరంలో పామాయిల్ తోటలో మృతదేహం కనిపించింది. ఆ పక్కనే కారు సైతం కనబడుతుంది. అశ్విని తండ్రి నునావత్ మోతిలాల్ జాడ కోసం పోలీసులు ఆపరేషన్ ను కొనసాగిస్తున్నారు.