పాకిస్థాన్ ఆర్మీ‌పై ఉగ్రవాదుల దాడి.. 11 మంది మృతి

by GSrikanth |
పాకిస్థాన్ ఆర్మీ‌పై ఉగ్రవాదుల దాడి.. 11 మంది మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) పాకిస్థాన్‌లో మరోసారి పాకిస్థాన్ భద్రతా బలగాలపై ఉగ్రవాదులు విరుచుకపడ్డారు. చిత్రాల్‌లోని పాకిస్తాన్ ఆర్మీ పోస్టులపై ఇవాళ ఉదయం 4 గంటలకు టీటీపీ దాడి చేయడంతో 11 మంది పాకిస్తానీ సైనికులు మరణించారని సమాచారం. మరో 40 మంది గాయపడ్డారని తెలిసింది. 12 మంది టీటీపీ ఉగ్రవాదులను హతమార్చినట్లు పాకిస్తాన్ ఆర్మీ పేర్కొంది. ఈ దాడి సమయంలో పాకిస్తాన్ ఆర్మీ సైనికులు అపహరణకు గురైనట్లు స్థానికులు నివేదించారు.


Advertisement

Next Story