- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాపను ఆడిస్తానని తీసుకెళ్లి...
దిశ, సిద్దిపేట ప్రతినిధి : మూడు సంవత్సరాల చిన్నారిని ఆడిస్తానని ఓ వ్యక్తి తీసుకెళ్లి లైంగికదాడి చేసిన సంఘటన సిద్దిపేటలో ఆలస్యంగా వెలుగు చూసింది. త్రీ టౌన్ సీఐ విద్య సాగర్ తెలిపిన వివరాల ప్రకారం...సిద్దిపేట పట్టణంలో నిర్మిస్తున్న గో గ్రీన్ అపార్ట్ మెంట్ లో నేపాల్ కు చెందిన వ్యక్తి వాచ్ మెన్ గా పనిచేస్తూ భార్య, మనవరాలు ( కొడుకు కూతురు) తో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈనెల 19న అపార్ట్ మెంట్ లో పెయింటింగ్ పని చేస్తున్న ఉత్తర ప్రదేశ్ గోరఖ్ పూర్ జిల్లా రసూల్ పురా గ్రామానికి చెందిన అజయ్ అనే వ్యక్తి వాచ్ మెన్ మనవరాలిని
ఆడిస్తానని చెప్పి తన రూంలోకి తీసుకుపోయి లైంగికదాడి పాల్పడగా పాప ఏడవడంతో వాచ్ మెన్ వెళ్లి చూసి మనవరాలిని ఎత్తుకొని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపి పాపను ప్రభుత్వ ఆసుపత్రి పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం పొన్నాల బ్రిడ్జ్ వద్ద నిలబడి పారిపోడానికి సిద్ధంగా ఉన్న అజయ్ ని పోలీసులు పట్టుకొని విచారించి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించినట్లు సీఐ పేర్కొన్నారు. కేసు దర్యాప్తు పూర్తి చేసి బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ అనురాధ పోలీసు అధికారులను ఆదేశించారు.
- Tags
- rape