ఆర్మూర్ లో ఒకరి అనుమానాస్పద మృతి..

by Kalyani |
ఆర్మూర్ లో ఒకరి అనుమానాస్పద మృతి..
X

దిశ ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఓ కల్లు బట్టి వద్ద బండి రవికుమార్ (37) అనే యువ వ్యక్తి శనివారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన రవికుమార్ ఆర్మూర్ పట్టణంలోని కల్లు బట్టి దగ్గర స్నేహితులతో గొడవ పడి మృతి చెందినట్లు మృతుడి భార్య లావణ్య ఆరోపించింది. పట్టణంలోని కల్లు బట్టిలో తన భర్త రవిని ఆయన స్నేహితులే హత్య చేశారని ఆయన భార్య లావణ్య, మృతుడి బంధువులు ఆరోపించారు. ప్రతిరోజు పట్టణంలోని మా ఇంటికి వచ్చే మా ఆయన భర్త రవి స్నేహితులు శనివారం రాత్రి మా ఆయన మృతికి కారకులయ్యారే కాబట్టి మా ఇంటికి రాలేదని మృతుడి భార్య అనుమానం వ్యక్తం చేసింది. ఆర్మూర్ పట్టణంలో అనుమానాస్పదంగా మృతి చెందిన బండి రవికుమార్ మృతిపై మృతుడి భార్య లావణ్య బంధువులు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్య లావణ్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

Next Story

Most Viewed