కన్నీరు పెట్టిస్తున్న వృద్ధ దంపతుల ఆత్మహత్య

by Mahesh |
కన్నీరు పెట్టిస్తున్న వృద్ధ దంపతుల ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: ఓ వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న తీరు సమాజాన్ని కన్నీరు పెట్టిస్తున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మణుగూరు మండలం, పగడేరు పంచాయతీలో ఎస్టీ కాలనీకి చెందిన కాసరబాద రామచంద్రయ్య(75), సరోజనమ్మ(69), అనే వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికంగా ఉన్న వ్యవసాయ బావిలో దూకి సరోజనమ్మ ఆత్మహత్య చేసుకోగా.. చెట్టుకు ఉరి వేసుకుని భర్త రామ చంద్రయ్య ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో పగడేరు గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా వృద్ధ దంపతుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed