ఉపాధ్యాయ సంఘం నాయకుడు హఠాన్మరణం

by Aamani |
ఉపాధ్యాయ సంఘం నాయకుడు హఠాన్మరణం
X

దిశ, నవాబుపేట : ఉపాధ్యాయ సంఘం నేత మరికంటి బాల్ రాజ్ (51) మంగళవారం హఠాన్మరణం పాలయ్యారు. మండల పరిధిలోని యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన బాల్ రాజ్ ఇదే మండల పరిధిలోని పుట్టోనిపల్లి తండా ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం సెలవు పెట్టిన ఆయన తన స్వగ్రామమైన యన్మన్ గండ్ల లో గల తన సొంత భూమిలో సాగు చేసిన వరి పంటకు మందు పిచికారి చేస్తూ మధ్యలో గుండె నొప్పి రావడంతో తీవ్ర ఆయాసానికి లోనయ్యారు. అది గమనించిన ఇరుగు పొరుగు వారు హుటాహుటిన మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆయనను పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిపారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

Advertisement

Next Story

Most Viewed