Ap News: నలుగురు అంతర్జాతీయ స్మగ్లర్ల అరెస్ట్.. 50 కేజీల గంజాయి సీజ్

by srinivas |   ( Updated:2024-11-02 15:31:47.0  )
Ap News: నలుగురు అంతర్జాతీయ స్మగ్లర్ల అరెస్ట్.. 50 కేజీల గంజాయి సీజ్
X

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా(Annamaya District)లో యదేచ్ఛగా గంజాయి(Ganja) తరలింపు జరుగుతోంది. స్థానిక ప్రాంతాల నుంచి తమిళనాడు(Tamilanadu)కు లక్షల విలువైన గంజాయి సరఫరా సాగుతోంది. తాజాగా ఓబులవారిపల్లి(Obulavaripalli) మండలం మంగంపేట(Mangampet) వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కడప(Kadapa)- చెన్నై(Chennai) జాతీయ రహదారి‌పై వాహన తనిఖీల్లో నలుగురు అంతర్రాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.10 లక్షలు విలువచేసే సుమారు 50 కేజీల గంజాయితో పాటు సుమో, కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను, పట్టుకున్న గంజాయిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed