HYD : ఎస్‌వోటీ పోలీసుల మెరుపు దాడులు.. డ్రగ్స్ స్వాధీనం

by Rajesh |
HYD : ఎస్‌వోటీ పోలీసుల మెరుపు దాడులు.. డ్రగ్స్ స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు మెరుపుదాడులు చేశారు. దాడుల్లో భాగంగా భారీగా ఎంఎండీఏ డ్రగ్స్‌ను పట్టుకున్నారు. శేషాద్రినగర్‌లో కూకట్ పల్లి పోలీసులతో కలిసి ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. శైలేష్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తుల నుంచి 3 గ్రాముల ఎంఎండీఏ స్వాధీనం చేసుకున్నారు. ఎంఎండీఏ, గంజాయిను ఎస్ వోటీ పోలీసులు పట్టుకున్నారు. తులసీనగర్‌లో జగద్గిరి గుట్ట పోలీసులతో కలిసి దాడులు నిర్వహించి రోహిత్, తిలక్ సింగ్ అనే వ్యక్తుల నుంచి 45 గ్రాముల గంజాయి, 3 గ్రాముల ఎంఎండీఏ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి లోతుగా విచారిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed